మోకిల సర్పంచ్ గా చిట్టెంపల్లి శేఖర్ 230 ఓట్ల మెజార్టీతో గెలుపు
శంకర్‌పల్లి సాక్షిత : శంకర్‌పల్లి మండల పరిధిలోని మోకిల సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు గౌండ్ర సత్యం బలపరిచిన అభ్యర్థి చిట్టెంపల్లి శేఖర్ 230 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ అన్ని రంగాల్లో గ్రామాన్ని సీనియర్ నాయకులతో కలిసి అభివృద్ధి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో బాధ్యత అప్పజెప్పిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలన్నారు. గ్రామాన్ని మరింత అభివృద్ధి వైపు తీసుకెళ్తామని తెలిపారు. గ్రామస్తులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలని తెలియజేశారు. సర్పంచ్ గెలుపు బాధ్యతను మరింతగా పెంచిందని ధీమా వ్యక్తం చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
