శరీర దానంతో గొప్ప సందేశం ఇచ్చారు చీర్ల రాంచందర్
పలుస శంకర్ గౌడ్ జిల్లా అధ్యక్షులు
సాక్షిత వనపర్తి
వనపర్తి పట్టణంలోని బస్వాన గడ్డకు చెందిన రైల్వే శాఖలో రిటైర్డ్ అయిన చీర్ల రాంచందర్ ఆనారోగ్యముతో మరణించారు. వారి చివరి కోరిక నా బాడీని మెడికల్ కాలేజ్కి ఇవ్వాలన్నీ కోరారు. వారి కుమారుడు శ్రీధర్ మరియు కుటుంబ సభ్యులు చీర్ల రాంచందర్ బాడీని మెడికల్ కాలేజీ అప్పజెప్పారు. వనపర్తి సాహితీ కళా వేదిక అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ ఇంటికి వెళ్లి పరామర్చించారు.
తన బాడీ ని మెడికల్ కాలేజీ కి అప్పజెప్పి గొప్ప సందేశాన్ని సమాజానికి ఇచ్చారని. రాంచందర్ అని అన్నారు. అన్నీ దానాల కన్నా శరీర భాగాలు దానం చేయడం గొప్ప విషయం అన్నీ కుటుంబ సభ్యులను శంకర్ గౌడ్ అభినందించారు.రాంచందర్ కుటుంబాన్ని సమాజం ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో గోపాల్‌పేట MEO. చంద్రశేఖర్ , జిహెచ్ఎం. గణేష్ కుమార్ , గంధం నాగరాజు, బండారు శ్రీనివాస్ ,శ్రీధర్, భాస్కర్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
