చిలకలూరిపేట మండలం స్థానిక శాఖా గ్రంథాలయం ఆధ్వర్యంలో జరుగుతున్న 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా ఐదోవ రోజైన మంగళవారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రోటరీ క్లబ్ ఆఫ్ పండరీపురం నిర్వహించారు. క్లబ్ అధ్యక్షులు బోనం వెంకటేశ్వరరావు అధ్యక్షత వహిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుస్తక పఠనం వలన కలిగే ప్రయోజనం గురించి విద్యార్థులకు వివరించారు. ప్రపంచ నాగరికత అచ్చుయంత్రం కనుగొన్నాక శరవేగంగా అభివృద్ధి చెందిందన్నారు.
బాల్యం నుండే పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జూనియర్ విద్యార్థులకు, సీమియర్లకు విడివిడిగా జనరల్ క్విజ్ పోటీ నిర్వహించారు. తొలుత గ్రంధాలయ ఉద్యమ ప్రముఖుల చిత్రపటాలకు పూలమాలలు వేసి స్మరించారు. విద్యార్థులచే పుస్తక పఠన ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పండరీపురం రోటరీ క్లబ్ పెద్దలు బి.చెంచుపున్నయ్య, అలా దాసునాయన, బిట్రా నాగేశ్వరావు, అలాంఘార్ మోహన్, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు బొప్పూడి వెంకటేశ్వర్లు తో పాటు వివిధ పాఠశాలలనుండి వచ్చిన ఉపాధ్యాయిని ఉపాద్యాయులు, గ్రంథాలయాభివృద్ధి కమిటి కార్యదర్శి డా. దార్ల బుజ్జిబాబు, గ్రంధాలయ ఇంచార్జ్ అధికారి డి.వీర్రాజు, సిబ్బంది సరోజినీ, సలోమి, అచ్చమ్మ, సాంబిరెడ్డి, తదితరులున్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
