రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయం
ఇది రైతు ప్రభుత్వం.
పుట్టపర్తి ప్రాథమిక సహకార సొసైటీ లో రైతులకు యూరియా పంపిణీ చేసిన ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి
పుట్టపర్తి :
రైతు కళ్లలో ఆనందం చూడాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయమనీ పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. పుట్టపర్తి ప్రాథమిక సహకార సొసైటీ కార్యాలయంలో శుక్రవారం సుమారు 140 మంది రైతులకు 280 బస్తాల యూరియాను నియోజవర్గ టీడీపీ బాధ్యులు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి తో కలసి ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి చేతుల మీదుగా రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ ,రైతు సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ఈసారి వర్షాలు బాగా కురవడంతో అన్ని చెరువుల్లో నీరు సంవృద్ధిగా ఉన్నాయని రైతులు సకాలంలో పంటలు సాగు చేసుకుని బంగారు పంటలు పండించుకోవాలని సూచించారు.
పంట సాగు చేసిన ప్రతి రైతుకు సరిపడే ఎరువులు ప్రభుత్వం వద్ద నిల్వలు ఉన్నాయని గుర్తు చేశారు. ప్రతి రైతుకు యూరియా ప్రభుత్వం సహకార సొసైటీల ద్వారా అందిస్తుందని పేర్కొన్నారు. ఒకొక్క యూరియా బస్తా ధర రూ.266.50ల ప్రభుత్వ రాయితీ తో ప్రభుత్వం రైతులకు అందజేస్తోందని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను గుర్తు పెట్టుకోవాలని కోరారు.మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ, ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం అన్నారు.గత ఐదేళ్ల వైసిపి పాలనలో వ్యవసాయాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టారని గుర్తు చేశారు. రైతులకు అండగా నిలిచే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు.
ఎన్నికల ముందు టీడీపీ ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి ఏటా రూ.20 వేలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినందుకు ఇప్పటికే పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రైతులకు రెండు విడతలుగా ఒకొక్క రైతుకు రూ.14వేలు రైతు ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. ఇదే మంచి రైతు ప్రభుత్వం అని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి కొనియాడారు .ఈ కార్యక్రమంలో పుట్టపర్తి సహకార సొసైటీ అధ్యక్షులు ముమ్మునేని వెంకటరాముడు ,బ్యాంకు సీఈఓ రవిశంకర్ రెడ్డి ,రైతులు తదితరులు పాల్గొన్నారు.

