టీఎస్ జేఏ ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రెసిడెంట్ గా చంద్రశేఖర్ ఎన్నిక
శాలువాలతో సత్కరించిన యూనియన్ నాయకులు
సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన దుస చంద్రశేఖర్ ను అసోసియేషన్ కమిటీ సభ్యులు గురువారం సాయంత్రం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి మాట్లాడుతూ అసోసియేషన్ లో చేరిన అనతి కాలములోనే జర్నలిస్టుల సంక్షేమం కోసం అసోసియేషన్ అభివృద్ధి కోసం చంద్రశేఖర్ ఎంతో కృషి చేశారని ఆయన సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించడం జరిగిందని తెలిపారు.కృత నిశ్చయంతో పని చేసిన ప్రతి ఒక్కరిని తగిన స్థాయిలో గుర్తించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర కోశాధికారి కొరివి సతీష్ యాదవ్ మాట్లాడుతూ…. అసోసియేషన్ లో చేరిన సమయంలో తాను మండల నాయకుడిగా ఉన్నానని ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని
తనలాగే అందర్నీ తగిన సమయంలో గుర్తించడం జరుగుతుందని పేర్కొన్నారు. అసోసియేషన్ల అందరూ ఐకమత్యంతో ఉండి జర్నలిస్టుల సమస్యల కోసం కృషి చేయాలని సూచించారు.జిల్లా అధ్యక్షుడు గుంటి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ అసోసియేషన్లో చేరడం తన అదృష్టంగా భావిస్తున్నానని అహర్నిశలు జర్నలిస్టుల సంక్షేమం కోసమే కృషి చేస్తున్న టీఎస్జెఏ లో ఉన్న ప్రతి ఒక్కరు ఉద్యమస్ఫూర్తితో కొనసాగాలని తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన చంద్రశేఖర్ మాట్లాడుతూ తనను గుర్తించి అనతి కాలంలోనే ఈ బాధ్యత అప్పగించిన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కందుకూరి యాదగిరి అన్నకు అదేవిధంగా రాష్ట్ర కమిటీకి ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు యాతాకుల మధుసూదన్ పట్టణ అధ్యక్షుడు కొమ్మ గాని సైదులు గౌడ్, ఉపాధ్యక్షులు బచ్చలకూరి వెంకన్న ఆత్మకూరు (ఎస్) మండల అధ్యక్షుడు కొండ రవి తదితరులు పాల్గొన్నారు.

