స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే
సాక్షిత ప్రతినిధి – చంద్రగిరి: చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని పాకాల మండలం పాకాల పంచాయతీ గుట్టకింద ఇండ్లులో నూతన స్మార్ట్ రేషన్ కార్డులను ఎమ్మెల్యే పులివర్తి నాని పంపిణీ చేశారు. ముందుగా ఎమ్మెల్యే కి మండల స్థాయి అధికారులు, కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో రాజముద్రతో కూడిన స్మార్ట్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం అక్రమాలకు చెక్ పెట్టిందని తెలిపారు. గుట్టకింద ఇండ్లు
రేషన్ షాప్ పరిధిలోని 626 మందికి ఏ.టీ.ఎం తరహాలోని స్మార్ట్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ ఎమ్మెల్యే నాని అందజేశారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
