- కూటమి ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం , శ్రేయస్సు తోపాటుగా రాష్ట్ర అభివృద్ధి ఎంతో ముఖ్యం : చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని .
- అవి ఏవి పట్టని గత వైసిపి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం నుండి వెలువడే ప్రతి పేపరు కూడా వైసీపీ పార్టీ ప్రచారానికి వాడుకున్న ఘనత వైసిపి పార్టీది.
- రెవెన్యూ వ్యవస్థను కూడా వైసీపీ నాయకుల ప్రచారానికి వాడుకుంది….రైతుల పాస్ పుస్తకాలపై వైసీపీ నేతల ఫోటోలతో కూడిన ప్రచారం చేసుకుంది.
- కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఇబ్బంది కలిగించే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దుచేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు : ఎమ్మెల్యే పులివర్తి నాని .
- స్వర్ణ నారావారిపల్లి పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతం తరువాత స్వర్ణ చంద్రగిరి ప్రతిపాదనలు పంపాం : ఎమ్మెల్యే పులివర్తి నాని .
- చంద్రగిరి మండల కేంద్రమైన తాసిల్దార్ కార్యాలయంలో మీ భూమి…….మీ హక్కు రైతు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం.
- పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే పులివర్తి నాని .
- ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికిన ఆర్డీఓ రామ్మోహన్ గారు, తహసీల్దార్ శివరామ సుబ్బయ్య , ఇతర అధికారులు, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు.
- తిరుపతి రెవెన్యూ డివిజన్ చంద్రగిరి మండలం పరిధిలోని ఐదు గ్రామాలలో రీ సర్వే నిర్వహించారు. • రెడ్డివారిపల్లి లో రీసర్వే పూర్తి చేసి 40 మంది రైతులకు రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు మంజూరు చేసిన కూటమి ప్రభుత్వం.
- ఎమ్మెల్యే పులివర్తి నాని చేతుల మీదుగా పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం .
- పాసుపుస్తకాలు ఇచ్చే సమయంలో రైతుల భూ వివరాలు అడిగి అందులో పొందు పరిచారు లేదా చూసి వారికి అందించిన ఎమ్మెల్యే .
- రీసర్వే ద్వారా భూ వివాదాలు తొలగిపోతాయని, రైతులకు తమ భూములపై పూర్తి హక్కులు లభిస్తాయని తెలిపిన ఎమ్మెల్యే .
- రాజకీయాలకు సంబంధం లేకుండా కూటమి ప్రభుత్వం రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు రైతులకు అందిస్తుంది: ఎమ్మెల్యే .
- రీసర్వే ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగిందని, రైతులు తమ భూముల వివరాలను క్షేత్రస్థాయిలో సరిచూసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
- పాస్ పుస్తకాలు అందుకున్న రైతులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ కి, ఎమ్మెల్యే పులివర్తి నాని కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.
- ఈ కార్యక్రమంలో జిల్లా , మండల స్థాయి రెవెన్యూ అధికారులు , రైతులు , కూటమి ప్రభుత్వ నాయకులు పాల్గొన్నారు.

