చంద్రబాబు ఆలోచనలే.. రాష్ట్ర పెట్టుబడుల ఆకర్షణ మంత్రాలు : ప్రత్తిపాటి

Sakshitha news

చంద్రబాబు ఆలోచనలే.. రాష్ట్ర పెట్టుబడుల ఆకర్షణ మంత్రాలు : ప్రత్తిపాటి

సాక్షిత : * బిజినెస్ రిఫార్మర్ పురస్కారం..ముఖ్యమంత్రులకు లభించడం చాలా అరుదు.

  • స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ తో చంద్రబాబు గ్లోబల్ ఇన్వెస్టర్స్ నమ్మకం, విశ్వాసాలు చూరగొన్నారు.
  • నేడు చంద్రబాబు తీసుకునేది కేవలం అవార్డు మాత్రమే కాదు.. రాష్ట్ర ప్రజలు తనపై ఉంచిన అచంచలమైన నమ్మకానికి అసలైన గుర్తింపు.
  • నిరుద్యోగ రహిత ఏపీ కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ లకు రాష్ట్ర యువత తరుపున ప్రత్యేక అభినందనలు
  • ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) లో శాసనసభ్యులు ప్రత్తిపాటి

పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ దేశంలోనే మేటిగా నిలవడానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు విభిన్న ఆలోచనా విధానమేనని, ఆయన వినూత్న పనితీరుకు గుర్తింపుగానే బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం లభించిందని, ఇలాంటి పురస్కారాలు రాజకీయ నాయకులకు లభించడం చాలా అరుదని శాసనసభ్యులు, టీడీపీ జోనల్ కో ఆర్డినేటర్ ప్రత్తిపాటి పుల్లారావు అభిప్రాయపడ్డారు.

ప్రజాసమస్యల పరిష్కారంలో భాగంగా ఆయన చిలకలూరిపేటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) నిర్వహించి, ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రైవేట్ బ్యాంక్ సిబ్బంది అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారని యడ్లపాడు మండలం ఉప్పరపాలెం గ్రామస్తులు ప్రత్తిపాటికి ఫిర్యాదు చేశారు. సమస్యపై స్పందించిన ప్రత్తిపాటి.. బ్యాంకు సిబ్బందితో మాట్లాడి ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తానని చెప్పారు. తాగునీటి సమస్యలపై వచ్చే అర్జీలను అధికారులు గంటల వ్యవధిలోనే పరిష్కరించాలని, క్షేత్రస్థాయి పరిశీలనతో ప్రజలకు నీటి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రత్తిపాటి ఆదేశించారు. వినతులు స్వీకరించిన అనంతరం ప్రత్తిపాటి మీడియాతో మాట్లాడారు.

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ముఖ్యమంత్రిది ఎప్పుడూ అగ్రస్థానమే..
ప్రజల అభిమానం.. వారు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎల్లప్పుడూ దేశనాయకుల్లోనే అగ్రస్థానంలో నిలుస్తారని ప్రత్తిపాటి చెప్పారు. వయసును సైతం లెక్కచేయకుండా నిత్యం పెట్టుబడుల ఆకర్షణ..పరిశ్రమల గ్రౌండింగ్ పైనే ముఖ్యమంత్రి దృష్టి పెట్టారన్నారు. చంద్రబాబు ఆలోచనలే రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే గొప్ప మంత్రాలని ప్రత్తిపాటి అభివర్ణించారు. నేడు ముంబైలో ముఖ్యమంత్రి తీసుకుంటున్న బిజినెస్ రిఫార్మర్ పురస్కారం, రాష్ట్ర ప్రజలు తనపై ఉంచిన అచంచలమైన నమ్మకానికి అసలైన గుర్తింపు అని ప్రత్తిపాటి తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ విధానాలతోనే చంద్రబాబు గ్లోబల్ ఇన్వెస్టర్స్ నమ్మకం, విశ్వాసాలు చూరగొన్నారన్నారు..
చంద్రబాబు కృషి ఫలించి.. అతిత్వరలోనే రాష్ట్రం టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, క్వాంటమ్, ఏఐ విభాగాల్లో అగ్రగామిగా నిలుస్తుందన్నారు. నిరుద్యోగ రహిత ఏపీ కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ లకు ఈ సందర్భంగా ప్రత్తిపాటి, రాష్ట్ర యువత తరుపున ప్రత్యేక అభినందనలు తెలియచేశారు.

ఉద్యోగాల కల్పన హామీలో ప్రభుత్వం ఇప్పటికే విజయం సాధించింది..
5 ఏళ్లలో 20 లక్షలు ఉద్యోగాలిస్తామన్న హామీ అమల్లో కూటమి ప్రభుత్వం ఇప్పటికే విజయం సాధించిందని ప్రత్తిపాటి చెప్పారు. కేవలం 15 నెలల్లోనే 5 లక్షల ఉద్యోగాలు (4.71 లక్షల ఉద్యోగాలు) ఇవ్వడం ద్వారా 23శాతం హామీని నిలబెట్టుకుందన్నారు. దానికి తోడు నియోజకవర్గాల వారీగా జాబ్ మేళాలు, ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పనతో ప్రభుత్వం నిరుద్యోగ సమస్య పరిష్కారం దిశగా వేగంగా అడుగులేస్తోందన్నారు.

Scroll to Top