న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర హోం వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశంలో పాల్గొన్న లోక్ సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్ .
‘మోంథా’ తుఫాను నష్టంపై వివరణ
ఆంధ్రప్రదేశ్‌ను ఇటీవల అతలాకుతలం చేసిన ‘మోంథా’ తుఫాను వల్ల రాష్ట్రంలో జరిగిన భారీ నష్టాన్ని ఆయన కమిటీ దృష్టికి తీసుకెళ్లారు.
పలు జిల్లాల్లో పంట నష్టం, రహదారుల విధ్వంసం, మౌలిక సదుపాయాల నష్టం గణనీయంగా జరిగిందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
రాష్ట్రానికి రూ. 5,265 కోట్లు కోరిన ఎంపీ .
తుఫాను ప్రభావం నుంచి రాష్ట్రం త్వరగా కోలుకోవడానికి, సహాయక చర్యలు, పునరుద్ధరణ పనుల కోసం రూ. 5,265 కోట్ల తక్షణ ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయాలని అభ్యర్థించారు.
ఆంధ్రప్రదేశ్‌కు నిధులు త్వరితగతిన విడుదల చేయాలని కోరారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
