కేసు నెం 11/2026: కృష్ణా జిల్లా ఆర్టీసీ కానిస్టేబుల్ అరెస్ట్
నాదెండ్ల మండలం ఇర్లపాడు గ్రామంలో సోమిశెట్టి మంజు భార్గవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృష్ణా జిల్లాలో ఆర్టీసీ కానిస్టేబుల్‌గా మేకల నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసు నెం 11/2026 ఈ చర్యలు తీసుకున్నట్లు నాదెండ్ల ఎస్ఐ తెలియజేశారు.ఈ కేసులో నిందితుడైన మేకల నరేంద్రను సోమవారం నాడు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, రూరల్ సీఐ సుబ్బ నాయుడు పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగి అయ్యి ఉండి చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడటంతో ఈ కేసు ప్రాధాన్యత సంతరించుకుంది.
14 రోజుల రిమాండ్ విధింపు
అరెస్టయిన నిందితుడిని అనగా మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు నిందితుడిని జైలుకు తరలించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
