ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
వచ్చే శనివారం 7వ తేదీన బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఇఫ్తార్ విందు కార్యక్రమానికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరవ్వనున్న నేపథ్యంలో 129 – సూరారం డివిజన్ టీఎస్ఐఐసీ కాలనీ మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లో ఇఫ్తార్ విందు ఏర్పాట్లపై బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ నియోజకవర్గ మైనారిటీ సోదరులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…… ఇఫ్తార్ విందు మతసామరస్యానికి ప్రతీక అని, రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఈనెల 7వ తేదీన నిర్వహించనున్న ఇఫ్తార్ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా నాయకులు, మైనారిటీ సోదరులు సమన్వయ పరుచుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, డివిజన్ అద్యక్షులు పుప్పాల భాస్కర్, వివిధ డివిజన్లకు చెందిన మైనారిటీ సోదరులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

