ప్రజా పాలనా – ప్రగతి ప్రాణాలిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా, బౌరంపేట్ డివిజన్ ని సందర్శించిన జోనల్ కమీషనర్ పింకీష్ కుమార్ ఐఏఎస్ మరియు మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి .
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,బౌరంపేట్ డివిజన్ లోని పలు సమస్యలను టీపీసీసీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి దృష్టికి తీసుకుని వచ్చినందున నేడు జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్ ,దుండిగల్ డిప్యూటీ కమిషనర్ మనికరణ్ ,మరయు మున్సిపల్ అధికారులందరితో కలిసి పర్యటించి స్థానిక సమస్యల పరిష్కారం కోసం పలు సూచనలు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి , బౌరంపేట్ మాజీ సర్పంచ్ యాది రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి భరత్ గౌడ్, జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శి చిరంజీవి,సీనియర్ నాయకులు విజయ్ గౌడ్, సురేష్, పోచి మహేష్, ఆంజనేయ వర్మ స్థానిక ప్రజలు, వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

