ఎన్టీపీసీ టౌన్షిప్లో భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు
అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు
నిర్వహించిన శ్రీమతి మనాలి ఠాకూర్…
సాక్షిత పెద్దపల్లి–జిల్లా ప్రతినిధి, రామగుండం |
రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు, వారి సతీమణి, మక్కన్ సింగ్ సేవా సమితి చైర్పర్సన్ మనాలి ఠాకూర్ ఎన్టీపీసీ టౌన్షిప్లో ఘనంగా నిర్వహించిన బోనాల మహోత్సవాల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీమతి మనాలి ఠాకూర్ సంప్రదాయబద్ధంగా అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.
బోనాల వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో, భక్తుల జయజయధ్వానాల మధ్య ఘనంగా నిర్వహించగా, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.


