కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మహిళలకు సముచిత గౌరవం : బీరవోలు రవీందర్ రెడ్డి.
సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : ఇందిరమ్మ కాలం నాటి నుండి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే దేశంలో మహిళలకు మంచి గౌరవం లభిస్తుందని. సూర్యాపేట మండల మాజీ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీరవోలు రవీందర్ రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని సోలిపేట, రామవరం గ్రామాలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలకు చీరలను పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందివ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందంజలో ఉందని తెలిపారు. ఆర్థికంగా మహిళను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు సముచితస్థానం కల్పించనుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వం చేపట్టిన అన్ని పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సంఘ బంధం అధ్యక్షులు పాలాది రాజి, కాటి లలితమ్మ,వంగపల్లి వినోద,మేకల కళావతి మహమ్మద్ రషీద,గ్రామ కార్యదర్శిలు చైతన్య ,కృష్ణ అంగన్వాడి టీచర్ బొడ్డు సరోజ,కాంగ్రెస్ పార్టీ నాయకులు చెరుకు వెంకన్న గోగిరెడ్డి వెంకటరెడ్డి పల్స రమేష్ మాజీ సర్పంచి బొల్లం సుమతి నాగరాజు ఉయ్యాల ఉపేందర్, గిరి గ్రామ మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
