నెల్లూరు వారి పుష్పాలంకరణ వేడుకల్లో పాల్గొన్న బైరెడ్డి, దారపనేని
కనిగిరి సాక్షిత: కనిగిరి నియోజకవర్గం పామూరు మండల విశ్రాంత ఉపాధ్యాయులు నెల్లూరు నరసింహారావు కుమారులు పామూరు పట్టణ ప్రముఖ డెంటల్ డాక్టర్ నెల్లూరి రవిబాబు ధర్మపత్ని శ్రీమతి సుభద్ర దంపతుల ఏకైక కుమార్తె చిరంజీవి మానస పుష్పాలంకరణ వేడుకలు పామూరు పట్టణంలోని సత్య దేవుని కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ పుష్పాలంకరణ వేడుకలలో కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్, పామూరు సింగిల్ విండో మాజీ అధ్యక్షులు బైరెడ్డి జయరామి రెడ్డి పాల్గొని చిరంజీవి మానసను అక్షింతలతో ఆశీర్వదించి దీర్ఘాయుష్యం భవ అని దీవించారు.
ఈ పుష్పాలంకరణ వేడుకలలో పామూరు ప్రముఖ వైద్య నిపుణులు, ఉపాధ్యాయులు, కనిగిరి నియోజకవర్గ బిజెపి కన్వీనర్ కొండిశెట్టి వెంకటరమణయ్య, పామూరు మండల టిడిపి మాజీ అధ్యక్షులు పువ్వాడి వెంకటేశ్వర్లు, తిరి వీధి జనార్ధన్ రావు, శ్రీ మదన వేణుగోపాలస్వామి ట్రస్ట్ బోర్డు చైర్మన్ బండ్ల నారాయణ, పామూరు పట్టణ టిడిపి మాజీ అధ్యక్షులు ఖాజా రహమతుల్లా, టిడిపి నాయకులు ఫత్తు మస్తాన్, డివి పాలెం హజరత్, గద్దె సుధాకర్ అండ్ బ్రదర్స్ , రిటైర్డ్ ఆర్ ఐ ఎన్ నాగేశ్వరరావు, పలువురు రాజకీయ ప్రముఖులు,మిత్రులు, శ్రేయోభిలాషులు భారీ సంఖ్యలో పాల్గొని చిరంజీవి మానసను అక్షింతలతో ఆశీర్వదించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
