అంబేద్కర్ గురుకులాల వంట సిబ్బందికి అవగాహన కార్యక్రమం…
సాక్షిత ::ఎన్‌టిఆర్, కృష్ణా జిల్లాల ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ (APSWREIS) పరిధిలోని సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థల్లో వంట సిబ్బందికి ఒక రోజు అవగాహన కార్యక్రమాన్ని స్థానిక జేడ్ సూట్స్
హోటల్ లో నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ యాజమాన్యం, టాటా ట్రస్ట్ మరియు విజయవాహిని చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. వంటకాల తయారీలో పౌష్టికాహారం, శుభ్రత, ఆరోగ్యకరమైన వంటపద్ధతులు, శుభ్రత అంశాలపై నిపుణులు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమానికి గురుకులాల అదనపు కార్యదర్శి శ్రీ సునీల్ రాజ్‌కుమార్, సంయుక్త కార్యదర్శి శ్రీమతి రూపవతి, డాక్టర్ రాజేష్ , ఎన్‌టీఆర్ జిల్లా డీసీవో, డిప్యూటీ అకడమిక్ అధికారి , జిల్లా అంబేద్కర్ గురుకులాల ప్రిన్సిపాళ్లు, కేర్‌టేకర్లు హాజరై పాల్గొన్నారు. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఆహార వండే విధానాలు, వంటగదుల పరిశుభ్రత, విద్యార్థులకు పౌష్టికాహారపరంగా మేలుచేసే మార్గాలపై చర్చ జరగింది. నిపుణులు అందించిన సూచనలను సిబ్బంది ఆచరణలో పెట్టాలని ఈ సందర్భంగా నిపుణులు అవగాహన కల్పించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
