టీపీసీసీ ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి అధ్యక్షతన కొంపల్లి లోని ఎస్‌ఎన్‌ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంపై BLAలకు అవగాహన మరియు శిక్షణ శిబిరంలో పాల్గొన్న టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి .
ఈ కార్యక్రమానికి SIR అబ్జర్వర్ ( తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్) ఎం ఏ ఫహీం, టీపీసీసీ జనరల్ సెక్రటరీ పీసరి మహిపాల్ రెడ్డి మరియు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ SSA కో-ఆర్డినేటర్ ఏపీ మిథున్ రెడ్డి పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, టీపీసీసీ ప్రోటోకాల్ వైస్ చైర్మన్ బొంగునూరి కిషోర్ రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆర్. లక్ష్మి, నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, డివిజన్ నాయకులు, BLAలు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
