హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం….
ఎస్సీ విద్యార్థులకు ఒకటో తరగతిలో ప్రవేశ అవకాశం
మే 29లోగా దరఖాస్తులు సమర్పించాలి…
–కలెక్టర్ కోయ శ్రీహర్ష…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: పెద్దపల్లి,
2026-27 విద్యా సంవత్సరానికి హైదరాబాద్ బేగంపేట్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఒకటో తరగతి (ఇంగ్లీష్ మీడియం) ప్రవేశాల కోసం జిల్లాకు చెందిన ఎస్సీ విద్యార్థిని, విద్యార్థులు మే 29లోగా దరఖాస్తులు సమర్పించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు.
విడుదల చేసిన ప్రకటనలో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాకు చెందిన ఎస్సీ విద్యార్థులు 2019 జూన్ 1 నుంచి 2020 మే 31 మధ్య జన్మించి ఉండాలని పేర్కొన్నారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షల లోపు ఉండాలని తెలిపారు.
దరఖాస్తుతో పాటు ఆదాయం, కులం, జనన ధృవీకరణ పత్రం, స్టడీ సర్టిఫికెట్, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో జత చేసి, గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించాలని సూచించారు. పూర్తి చేసిన దరఖాస్తులను మే 29 సాయంత్రం 5 గంటల లోగా సమీకృత జిల్లా కలెక్టరేట్లోని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు.
జూన్ 1న లాటరీ విధానంలో సీట్ల కేటాయింపు జరుగుతుందని, ఇతర వివరాలకు పెద్దపల్లి కలెక్టరేట్లోని జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
