ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! ఇరాన్ వార్ నేపథ్యంలో ఏర్పడిన ఎల్పీజీ సంక్షోభం (LPG Crisis) నేపథ్యంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎల్బీజీ సంక్షోభాన్ని అధిగమించేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొంత మేరకే ఫలితాలు ఇస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఇవాళ అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఇందులో ప్రస్తుతం ఎల్పీజీ గ్యాస్ సరఫరా సమస్యను ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లడమే సరైన పరిష్కారమని తేల్చేశారు.ఎల్బీజీ స్ధానంలో పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ), విద్యుత్ పరికరాల వినియోగం పెరిగేలా చూడాలని అధికారులకు సీఎం ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో ప్రతీ ఇంటికీ పీఎన్జీ కనెక్షన్లు ఇచ్చేలా కార్యాచరణ చేపట్టాలన్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో పీఎన్జీ విస్తరణ కోసం 2.34 లక్షల కనెక్షన్లు అందుబాటులో ఉన్నప్పటికీ 60 వేల మంది వినియోగదారులు మాత్రమే కనెక్షన్లు పొందారని అధికారులు సీఎంకు తెలిపారు. అయితే దీనిని 100 శాతం వినియోగించుకునేలా చూడటంతో పాటు, జిల్లాకు కనీసం 10 వేలకు తగ్గకుండా నూతన కనెక్షన్లు ఇవ్వాలంటూ సీఎం లక్ష్యాన్ని నిర్దేశించారు.అలాగే శ్రీకాకుళం – కాకినాడ పైప్ లైన్ పునరుద్ధరణపై కేంద్ర మంత్రికి లేఖ

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY