శ్రీవారిని దర్శించుకున్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్
సాక్షిత ప్రతినిధి – తిరుమల: శ్రీవారిని ఏపీ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్‌ను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ, వీజీవో రామ్ కుమార్ లు సాదరంగా అహ్వానించగా, అర్చక బృందం ఇస్తికఫాల్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో గవర్నర్ కు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఈవో, అదనపు ఈవోలు తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, విజివో రామ్ కుమార్, పీఆర్వో నీలిమ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY