ఇచ్చిన మాటను ఏనాడైనా… నిలబెట్టుకున్నారా బాబు
మహిళలను విద్యార్థులను రైతులను మోసం చేసిన బాబు
మా అప్పు ఎప్పుడు ఇస్తావని అడుగుతున్న మహిళలు రైతులు విద్యార్థులు
వైఎస్ఆర్సిపి రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి సిబ్యాల విజయభాస్కర్
రాయచోటి న్యూస్
చంద్రబాబు 8 సార్లు కుప్పం MLA 4 సార్లు ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని మాట్లాడటం చూస్తుంటే. కన్నతల్లికి పిడికెడు అన్నం పెట్టినోడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాని చెప్పినట్టుంది. సొంత నియోజకవర్గాన్ని ఇంతవరకు అభివృద్ధి చేయనోడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటున్నాడని ప్రజలు నవ్వుకుంటున్నారు అని వైఎస్ఆర్సిపి రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి సిబ్యాల విజయభాస్కర్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు గారు అధికారంలో రావడానికి ఎన్నో అబద్ధాలు చెప్పి 14 నెలలు గడుస్తున్న ఇంతవరకు మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తానని చెప్పి 14 నెలలకు గాను నేటికీ మహిళలకు 21 వేల రూపాయలు బాకీపడ్డారు. అలాగే నిరుద్యోగులకు నిరుద్యోగాభృతి నెలకు 3000 రూపాయలు ఇస్తానని చెప్పారు నిరుద్యోగులకు ఇప్పటికీ 42 వేల రూపాయలు బాకీ పడ్డారు. అలాగే రైతులకు 20 వేల రూపాయలు. మహిళలకు ఉచిత బస్సు. అలాగే చేనేతలకు. రజకులు నాయి బ్రాహ్మణులకు. మత్స్యకారులకు ఏడాదికి 20,000 ఇస్తానన్నారు. బీసీలకు 50 ఏళ్లకు పింఛను. ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు ఇస్తానని చెప్పి కేవలం కొంతమందికే ఒక్క సిలిండర్ ఇచ్చి చేతులు దులుపుకొని అన్నీ చేసేసాము అని. బడాయి చెప్పుకొని తిరుగుతున్న కూటమి నాయకులు. అయ్యా మీరు సూపర్ సిక్స్ హామీలే కాకుండా మరెన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏమి చేయలేక చేతులెత్తేశారు అందుకే ప్రజలు మిమ్మల్ని తీస్కరిస్తున్నారు.
అందుకే జగనన్నకు పట్టం కట్టడానికి సిద్ధమవుతున్నారు అందుకు ఉదాహరణ. మొన్న బంగారుపాలెం. నెల్లూరు యాత్రలే హిందూకు ఉదాహరణనాకు. మీరు జగన్మోహన్ రెడ్డిని ప్రజలను కలవనీయకుండా ఎన్నో చెక్పోస్టులు పెట్టనా ఎన్ని లాఠీచార్జీలు చేసిన ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి కలవనీయకుండా చేయాలని చూస్తున్న ఎన్నో కష్టాలు పడి పోలీసుల దగ్గర లాఠీ దెబ్బలు తిని తిరిగి మళ్ళీ జగనన్నను చూడాలని ఆశతో వస్తున్న ప్రజలు ఇందుకు ఉదాహరణ ఎందుకంటే కూటమి నాయకులు తప్పుడు మాటలే చెబుతారు. చెప్పిన హామీలు నెరవేర్చరు అనీ ప్రజలు గ్రహించారు. అందుకే జగనన్నే మా నాయకుడు జగనన్న వెంటే నడవాలని ప్రజలు కంకణం కట్టుకొని వేలాదిగా తరలివస్తున్నారు. ఓటమి నాయకులు మీరు పోలీసుల చేత ఎన్ని లాఠీచార్జిలు చేయించిన ఎన్ని కంచెలు వేసిన ఎన్ని రోడ్లకు గుంతలో తీసి రానివ్వకన్నా చేసిన ఏదో రూపంలో వచ్చి వాళ్ళు జగనన్న చూస్తున్నారంటే మీకు ఇంకా అర్థం కావడం లేదా మిమ్మల్ని ప్రజలు తీస్కరిస్తున్నారని. ఇప్పటికైనా చంద్రబాబు గారు బుద్ధి తెచ్చుకొని తప్పుడు కేసులు బరాయించడం జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ కల్పిస్తూ ప్రజలను కట్టుదిట్టం చేయాలని ఉద్దేశాలను పక్కనపెట్టి జగన్మోహన్ రెడ్డిని ప్రజలతో మమేకం చేసి ఆయనకు పోలీస్ రక్షణ కల్పించి మీరు చెప్పిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చి. ప్రజలను శాంతింపజేసి వారి మన్నులు పొందాలని కోరుకుంటున్నాం లేని పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల తరఫున పోరాటం అక్షరసత్యం ఆయనతో కలిసి రాష్ట్రమంతా కూడా వైఎస్ఆర్సిపి నాయకులు అభిమానులు అందరూ తోడై మీరు చెప్పిన హామీలు నెరవేర్చేంతవరకు మీపై యుద్ధం చేస్తూనే ఉంటారు కాబట్టి ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాం అని. వైఎస్సార్సీపి రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి సిబ్యాల విజయభాస్కర్ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు..
