యాదాద్రి పవర్ ప్లాంట్తెలంగాణ చరిత్రలో కేసీఆర్ చేసిన చెరగని మరో సంతకం

Sakshitha news

యాదాద్రి పవర్ ప్లాంట్
తెలంగాణ చరిత్రలో కేసీఆర్ చేసిన చెరగని మరో సంతకం!

తెలంగాణ భవిష్యత్ విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని, నల్లగొండ జిల్లా దామరచర్లలో 4,000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను నిర్మించిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే.

నేడు, ఈ ప్రాజెక్టులోని 800 మెగావాట్ల మొదటి యూనిట్ జాతికి అంకితమవుతోంది.

కేసీఆర్ దార్శనికతకు, దృఢ సంకల్పానికి ఇది నిలువెత్తు నిదర్శనం!

సమైక్య రాష్ట్రంలో తెలంగాణ కరెంట్ కష్టాలతో విలవిల్లాడింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే చీకట్లు తప్పవని నాటి పాలకులు భయపెట్టారు. కానీ రాష్ట్రం సిద్ధించిన తర్వాత, కేసీఆర్ విప్లవాత్మక చర్యలతో ఆ కష్టాలన్నీ తొలగిపోయాయి.

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్.. ఆనాడు కేసీఆర్ గారికి ఉన్న ముందుచూపు, పట్టుదలకు ప్రత్యక్ష సాక్ష్యం. ఈ ప్లాంట్ వెలుగులు పంచుతూ తెలంగాణ ప్రగతికి ఊతం ఇవ్వనుంది!

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రత్యేకతలు

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పూర్తి సామర్థ్యం 4000 మెగావాట్లు (5×800) – స్వతంత్య్ర భారత చరిత్రలోనే ఒక రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో ఉన్న అతిపెద్ద థర్మల్ పవర్ ప్లాంట్ ఇదే

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం BHELకు అప్పగించింది. దాదాపు రూ.20,400 కోట్లు విలువైన అర్డర్, భారత విద్యుత్ రంగ చరిత్రలో ఒక ప్రభుత్వ రంగ సంస్థకు ఇవ్వబడిన అత్యంత విలువైన ఆర్డర్‌గా నిలిచింది.

నిత్య కరెంట్ కోతలు, వారానికి రెండు రోజుల పవర్ హాలీడేల దుస్థితి నుంచి అన్ని రంగాలకు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేసేలా తెలంగాణను తీర్చిదిద్దిన కేసీఆర్ గారి దార్శనితకలో ఒక భాగమే యాదాద్రి పవర్ ప్లాంట్

2014లో కేవలం 7778 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం మాత్రమే ఉండగా, బీఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్ద కాలంలో తెలంగాణలో స్థాపిత సామర్థ్యాన్ని దాదాపు 20,000 మెగావాట్లకు చేరుకొనేలా చేసింది – ఇది దేశ చరిత్రలో ఎన్నడూ చూడని విజయగాథ!