యువత మారకద్రవ్యాల బారిన పడకుండా అన్ని రకాల చర్యలు

Officials and police representatives engaged in a meeting.

Sakshitha news

యువత మారకద్రవ్యాల బారిన పడకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని ఆదేశించిన అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్

సాక్షిత వనపర్తి *
జిల్లాలో యువత మదకద్రవ్యాల బారిన పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్ ఆదేశించారు.

       కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్, డీఎస్పీ వెంకటేశ్వర్లు తో కలిసి జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశం నిర్వహించారు. 

    ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో యువత మదకద్రవ్యాల బారిన పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని ఆదేశించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు వల్ల కలిగే చెడు ప్రభా వాలపై గ్రామస్థాయిలో, విద్యా సంస్థలలో ముఖ్యంగా ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ విషయంలో పోలీసు, ఎక్సైజ్ ప్రొహిబిషన్, సహా అన్నిశాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. 

  డీఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో మాదకద్రవ్యాల రవాణాను కట్టడి చేసేందుకు అనేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. బెల్ట్ దుకాణాలు, కల్లు దుకాణాలపై పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అనుమానంగా ఉండే దుకాణాలు, వాహనాలపై నిఘా పెట్టి కేసులు నమోదు చేస్తున్నామన్నారు. జిల్లాలో మాదకద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. 

     సమావేశంలో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.