సిపిఐ సభ్యుడు కర్రవుల శ్రీనివాస్ కి ఘనంగా నివాళులర్పించిన ఏఐటీయూసీ

Sakshitha news

సిపిఐ సభ్యుడు కర్రవుల శ్రీనివాస్ కి ఘనంగా నివాళులర్పించిన ఏఐటీయూసీ నగర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అబ్దుల్ కరీం, శనిగరపు చంద్రశేఖర్….

సాక్షిత పెద్దపల్లి //గోదావరిఖని :ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటియుసి రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో స్థానిక విఠల్ నగర్ లో నివాసముండే సీనియర్ కమ్యూనిస్టు పార్టీ నాయకులు అమరజీవి కామ్రేడ్ కర్రావుల లింగయ్య ప్రధమ కుమారుడు కర్రావుల శ్రీనివాస్ మరణించి, నేటికీ సంవత్సరం అవుతున్న సందర్భంగా ఏఐటియుసి రామగుండం నగర సమితి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అబ్దుల్ కరీం,శనిగరపు చంద్రశేఖర్, కర్రావుల ఓదెలు,కర్రావుల తిరుపతి (దాస్) ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.

కర్రావుల శ్రీనివాస్ మొదటి నుండి కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా ఉండి పార్టీకి తోడ్పాటు అందించడం జరిగింది.కర్రావుల శ్రీనివాస్ దూరం అవడం కమ్యూనిస్టు పార్టీకి, జవహర్ నగర్ శాఖకు తీవ్ర నష్టం జరిగిందని వారు కొనియాడారు. కర్రావుల. శ్రీనివాస్, భార్య పద్మ, కుమార్తె సోని, కుమారుడు చెక్రి లను, వారి కుటుంబ సభ్యులను ఏఐటియుసి రామగుండం నగర సమితి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అబ్దుల్ కరీం, శనిగరపు చంద్రశేఖర్ లు ఓదార్చడం జరిగింది.

Scroll to Top