ఎన్టిపిసి లో లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా తలపెట్టిన ఆందోళన కార్యక్రమాలు…
సాక్షిత పెద్దపల్లి// : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను, నాలుగు లేబర్ కోడ్లను . వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా తలపెట్టిన ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగినది అందులో భాగంగా మంగళవారం ఎన్టిపిసి లో గేట్ నెంబర్ 2 వద్ద జేఏసీ ఆధ్వర్యంలో నల్లబ్యార్జీలు, ప్లే కార్డ్స్ లతో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు హాజరై మాట్లాడుతూ, దేశంలో బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేకమైన నాలుగు లేబర్ కోర్లను తీసుకువచ్చి కార్మికుల అనుకూల మైనటువంటి చట్టాలను తొలగించి, యాజమాన్యాలకు అనుకూలమైనటువంటి చట్టాలను సవరిస్తూ కార్మికుల ప్రస్తుతం ఉన్నటువంటి హక్కులు లేకుండా చేస్తుంది.దీనివలన రాబోయే కాలంలో కార్మికులకు పని భద్రత లేకుండా పోయి ఎనిమిది గంటల పని నుండి 12 గంటల పని చేయాల్సిన పరిస్థితి తో పాటు కనీస వేతనాల చట్టం తో పాటు కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు మొత్తం తొలగించబడుతున్నాయని అన్నారు.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకొని కార్మికులకు కనీస వేతనం 26,000 జీవో ఇవ్వాలని, సమాన పనికి సమాధానం కనీస పెన్షన్ 9000 ఉండాలని, కార్మికుల ఉన్నటువంటి హక్కులు యధావిధిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో నిర్వహించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో జెఎసి నాయకులు సిహెచ్.ఉపేందర్, చిలుక.శంకర్, గిట్ల.లక్ష్మారెడ్డి, ఎడపాక.లక్ష్మణ్, రాధారపు. రాజ మల్లయ్య, భూమల.చందర్, ఆలేటి. శ్రీనివాస్, ఇసంపల్లి.రాజేందర్, గుండు. రాజయ్య, యాకూబ్, రామాచారి, రాఘవరెడ్డి, టీ.సత్యనారాయణ, ఎండి. జమీల్, నరసయ్య తో పాటు వివిధ సంఘాల ముఖ్య నాయకులు హాజరైనారు.

