నూతనకల్‌లో ధాన్యం నాణ్యత తనిఖీ చేసిన ఏఈఓ
సాక్షిత, సూర్యపేట జిల్లా ప్రతినిధి : నూతనకల్ FPC ధాన్యం కొనుగోలు కేంద్రంలో నాణ్యత పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనకల్ క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి బుసిగంపల జానయ్య గౌడ్ రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని తనిఖీ చేశారు. తేమ శాతం 17 శాతంగా ఉన్న రైతులకు కాంటాలు వేయుటకు టోకెన్లు మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ఇన్‌ఛార్జ్ బద్దం జ్యోతి, FPC సీఈఓ శైలజ,ఇమ్మారెడ్డి రేణుక తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు. అధికారులు రైతులకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ధాన్యాన్ని పూర్తిగా ఎండించి, శుభ్రంగా వడకట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
