పలు అభివృద్ధి పనులపై సీఎం సలహాదారులు

Sakshitha news

పలు అభివృద్ధి పనులపై సీఎం సలహాదారులు మర్యదపూర్వకంగా కలిసిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులు మరియు మౌలిక సదుపాయాల సమస్యల పరిష్కారం కొరకు ముఖ్యమంత్రి సలహాదారు (ప్రజా వ్యవహారాలు) వేం నరేందర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేసిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి
ఈ సందర్భంగా నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న రోడ్లు, డ్రైనేజీ, పార్కుల అభివృద్ధి, తాగునీటి సరఫరా తదితర మౌలిక సమస్యలను ,ప్రజల ఇబ్బందులను సవివరంగా వివరించగా వేం నరేందర్ రెడ్డి సానుకూలంగా స్పందించి సంబంధిత పై అధికారులతో చర్చించి సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు టి. లక్ష్మీ రెడ్డి, రషీద్, సిద్దనోల్ల సంజీవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top