నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించిన అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్

Sakshitha news

పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం..

నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించిన అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్

ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా వెంకటగిరిలోని నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ ప్రసాద్ రావు సందర్శించి పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ నామినేషన్ల ప్రక్రియ బందోబస్త్ పకడ్బందీగా నిర్వహించాలని, ఎన్నికల విధుల పట్ల పోలీస్ అధికారులు పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.ఈ సందర్భంగా కార్యాలయాల్లో నామినేషన్ స్వీకరణ ప్రక్రియను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీస్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

            పి ఆర్ వో
Scroll to Top