ఆచార్య ఎస్వీ రామారావు తెలుగు సాహిత్యానికి చేసిన సేవలు చిరస్మరణీయం……………..
. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
సాక్షిత వనపర్తి :
ఆచార్య ఎస్.వి.రామారావు చేసిన తెలుగు సాహిత్య సేవలు చిరస్మరణీయం అంటూ హైద్రాబాద్ ఎల్బీనగర్ చిత్ర లేఅవుట్ లోని బాలాజీ రెసిడెన్సీ కి వెళ్లి ఆయన భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళి అర్పించి వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలానికి చెందిన ఎస్.వి.రామారావు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా, తెలుగు శాఖాధిపతిగా, డీన్ గా ఎన్నో సేవలందించారని గుర్తు చేశారు... ఆచార్యునిగా, పరిశోధకుడిగా, తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవలందించిన ఆచార్య ఎస్వీ రామా రావు మృతి ఎంతో బాధకరం అని కొనియాడారు. ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దారు. వీరి పరిశోధన గ్రంథం సాహిత్య లోకంలో పేరెన్నిక గన్నది. తెలుగు సాహిత్య చరిత్రను రాసి మన ప్రాంతానికి ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చారు. ఎన్నో విలువైన గ్రంథాలను రచించి తెలంగాణ ప్రాంతానికి ఎంతో గౌరవాన్ని సంపాదించి పెట్టారని అన్నారు.
మాజీ మంత్రి వెంట బ్రాహ్మణ పరిషత్ రాష్ట్ర సభ్యులు గోపాల శర్శ, బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.

