బావిలో పడి అనుమానాస్పదంగా మహిళ మృతి
సాక్షిత వనపర్తి :
బావిలో పడి అనుమానాస్పదంగా మహిళమృతి చెందిన సంఘటన వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం కలవరాల గ్రామంలో చోటుచేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కలవరాల గ్రామానికి చెందిన బండారి శాంతమ్మ (40) భర్త బొక్కలయ్య శుక్రవారం మేస్త్రి పని కోసం శాంతమ్మ వీపనగండ్ల గ్రామానికి నాగ శేషు అనే మేస్త్రి వద్దకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి బయలుదేరిన ఆమె రాత్రి అయిన రాలేదని మరుసటి రోజు వీపనగండ్ల కు వెళ్లే దారిలో రోడ్డు పక్కనఉన్న బావిలో మహిళ శవం తేలాడుతుందని బావ, మరిది మృతురాలి ఇంట్లో తెలపడంతో మృతురాలు కుమారుడు బాలకృష్ణ భావి వద్దకు చేరుకొని చనిపోయింది తన తల్లి అని తన తల్లి మృతిపై అనుమానాలు ఉన్నాయని విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారని కుమారుడు బాలకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జై నరేష్ తెలిపారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
