విద్యార్థులకు ఇంటిదగ్గర ప్రత్యేకమైన స్టడీ కార్నర్ ఏర్పాటు చేయాలి
షాబాద్: సాక్షిత): షాబాద్ మండలం ప్రాథమిక పాఠశాల మన్మర్రిలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించి, విద్యార్థుల ప్రగతి పనితీరును తల్లిదండ్రులకు వివరించారు. ఈ సమావేశంలో విద్యార్థులు తెలుగు, ఇంగ్లీష్, గణిత అంశాలకు సంబంధించి భాష, న్యూమరాసి, పద్య, గద్య రూపంలో కొన్ని ప్రతిభ పఠన నైపుణ్యాలను తల్లిదండ్రుల సమక్షంలో ప్రదర్శించడం జరిగింది.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మర్పల్లి అశోక్ మాట్లాడుతూ ప్రభుత్వ బడులలో చదువుకునే విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు దీటుగా పోటీపడి చదువుతున్నారని, ఉపాధ్యాయులు తరగతిలో బోధించే అంశాలను ఇంటిదగ్గర విద్యార్థులు చదువుతున్నారా లేదా అనే విషయాన్ని తల్లిదండ్రులు పర్యవేక్షించాలని, తల్లిదండ్రులు వారి పిల్లల కోసం ఇంటిదగ్గర కొంత సమయం కేటాయించి వారి యొక్క చదువులను క్షుణ్ణంగా పరిశీలించాలని, విద్యార్థుల చదువుల పట్ల ఎలాంటి సందేహాలున్న పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులను కలవాలని, విద్యార్థుల చదువులకు సంబంధించిన అంశాల పట్ల చర్చించాలని,ప్రతి ఇంట్లో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్టడీ కార్నర్ ఏర్పాటు చేయాలని తెలిపారు.
పరీక్షలు సమీపిస్తునందున విద్యార్థులు ఇంటి దగ్గర ఆటలు తగ్గించి పాఠశాలలో నేర్చుకున్న అంశాలను ఇంటి దగ్గర తిరిగి చదవాలని సూచించారు. ఈ సమావేశంలో గ్రామ ప్రథమ పౌరులు లాలాపేట బందెయ్య, వార్డు సభ్యులు రాములు, వెంకటేష్, అనురాధ, మమత, రాధిక, కొమరమ్మ, మానెమ్మ, హారిక, ఈదయ, సతీష్, శంకరయ్య, నరసింహులు, బీరయ్య లక్ష్మి, మాధవి, ఉపాధ్యాయులు, వెంకటమ్మ, శ్రీలత, చంద్రకళ, పాఠశాల సిబ్బంది శ్యామలమ్మ, మల్లమ్మ పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY