సిఎస్ఐ హైస్కూల్ పరిరక్షణ కోసం ఉద్యమం ఉదృతం

Sakshitha news

సిఎస్ఐ హైస్కూల్ పరిరక్షణ కోసం ఉద్యమం ఉదృతం..

అక్రమ కట్టడాల అనుమతులను రద్దుచేసి, కూల్చేంతవరకు పోరాటం..

7న కుడా, 10 న కార్పొరేషన్ కార్యాలయాల వద్ద ఆందోళనలు..

రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్ష నేతలు..

148 ఏళ్ల చరిత్ర కలిగిన సిఎస్ఐ హైస్కూల్ ను కబళించి కనుమరుగు చేసి కాజేయాలనే కుట్ర తో బిషప్ వరప్రసాద్ చేసిన అక్రమాలను ఎండగట్టేందుకు ఐక్యంగా స్కూల్ పరిరక్షణ కోసం ఉద్యమానికి సమాయత్తమైనట్లు అఖిలపక్ష నాయకులు ఐక్యతరావు ,వెంకట శివ,సత్తార్, డేనియల్, గుర్రప్ప, జాషువా,హరినారాయణ లు పేర్కొన్నారు.

కడప నగర విద్యా చరిత్రకు ప్రతీకగా నిలిచిన పురాతన చరిత్ర కలిగిన సిఎస్ఐ ఎయిడెడ్ పాఠశాల పరిరక్షణకు నడుం బిగించాలని మంగళవారం ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సిపిఐ నగర కార్యదర్శి యన్ వెంకట శివ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అఖిలపక్ష పార్టీల ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హాయంలో కుడా అధికారులు స్కూల్లో కమర్షియల్ కాంప్లెక్స్ కు ఇచ్చిన అనుమతుల్లో అవినీత అక్రమాలు భారీ ఎత్తున జరిగాయన్నారు. సిఎస్ఐ హైస్కూల్ ఆటస్థలం, ఓపెన్ స్పేస్ లో తప్పుడు డాక్యుమెంట్లతో అనుమతుల్లో అక్రమాలు జరిగాయని నిగ్గు తేల్చిన సంబంధిత అధికారులు అనుమతులను రద్దు చేయడంలో నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. పేద బడుగు బలహీనవర్గాలు చదువుకుంటున్న సిఎస్ఐ స్కూల్ స్థలం అన్యాక్రాంతమవుతుంటే ప్రజా ప్రతినిధులైన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మారు మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు.కడప లోఎయిడెడ్ విద్యా సంస్థ నిర్వీర్యం అయ్యి విద్యార్థులకు నష్టం జరుగుతుంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పట్టించుకున్న పరిస్థితి లేకపోవడం దారుణమన్నారు. కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ గా ఉన్న జిల్లా కలెక్టర్ ఉన్నత స్థాయి దర్యాప్తు నివేదిక తో అక్రమార్కులందరిపై వేయాలన్నారు.
స్కూలు స్థలంలో అక్రమంగా కట్టిన కమర్షియల్ కాంప్లెక్స్ అనుమతులను వెంటనే రద్దుచేసి, అక్రమ కట్టడాలను కూల్చివేయాలని,సంబంధిత అక్రమార్కులందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, అక్రమాలకు వంత పాడిన సంబంధిత అధికారులందరినీ సస్పెండ్ చేసి కఠినంగా శిక్షించాలని , సి ఎస్ ఐ హైస్కూల్ స్థలాలను విద్యా సంబంధిత అవసరాలకే ఉపయోగించాలనీ డిమాండ్ చేస్తూ తీర్మానించారు. ఈనెల 7వ తేదీన కుడా కార్యాలయం వద్ద ఆందోళన,10 వ తేదీన కార్పొరేషన్ వద్ద అఖిలపక్షం ఆందోళన చేపట్టినట్లు వారు పేర్కొన్నారు. ఈలోపు అక్రమ కట్టడాలను కూల్చకపోతే మేమే కులుస్తామంటూ ఛలో సీఎస్ఐ స్కూల్ పేరుతో మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ర్యాలీగా వెళ్లి అక్రమ కట్టడాలను కూల్చే కార్యక్రమానికి సమాయత్తమవుతున్నట్లు వారు పేర్కొన్నారు. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ, బీఎస్పీ, అమ్మ ఆద్మీ పార్టీ, లోక్ సత్తా పార్టీల నాయకులు, విద్యార్థి, యువజన, కార్మిక , మైనారిటీ తదితర ప్రజాసంఘాల నాయకులు , పూర్వ విద్యార్థులు రిటైర్డ్ ఉపాధ్యాయులు డాక్టర్ శ్రీనివాసులు, దస్తగిరి రెడ్డి,సిఆర్వి ప్రసాద్, శ్రీకృష్ణ, అంకన్న, సుబ్బరాయుడు, మైనుద్దీన్, దస్తగిరి, డాక్టర్ పెంచలయ్య, సంపత్ కుమార్, అఖిలేష్, మల్లికార్జున, భాగ్యలక్ష్మి, నారాయణ, అబ్దుల్లా, విజయ్ కుమార్, శ్రీధర్, రమేష్, ఫణి రాజు, ఓబయ్య, హేమ చంద్రారెడ్డి, షావలి, భాస్కర్, చంద్రశేఖర్ , రాజ్ కుమార్, శేఖర్, శివ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top