మెడికల్ కాలేజీ ల ప్రయివేటికరణను నిరసిస్తూ నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ గొర్లె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

Sakshitha news

మెడికల్ కాలేజీ ల ప్రయివేటికరణను నిరసిస్తూ నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ గొర్లె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ


ఎచ్చెర్ల నియోజకవర్గ కేంద్రం ఎచ్చెర్ల లో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఎచ్చెర్ల నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు & వైసీపీ ఇంచార్జ్ గొర్లె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీ లను ప్రయివేట్ కు అప్పాజెప్పడం పై భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వం పెత్తందారి వ్యవస్థకు మద్దతు తెలుపుతూ రాష్ట్రం లోని 17 మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రయివేట్ కు అప్పాజెప్పడం అన్యాయం అని దీని వలన పేద విద్యార్థులు ఉచిత మెడికల్ సీట్లు కోల్పోవడమే కాకుండా పేద రోగులకు కూడా నాణ్యమైన ఉచిత వైద్యం అందదని అక్షేపించారు కూటమి ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని విద్యార్థి ప్రజా ఉద్యమాల తో మెడలు వంచుతామని అన్నారు వైసీపీ ఈ ప్రజా ఉద్యమానికి విద్యార్థులు యువకులు ప్రజలు మద్దతు తెలపాలని పిలుపు నిచ్చారు ఈ కార్యక్రమం లో జిల్లా వైసీపీ కమిటీ నాయకులు నాలుగు మండలాల ఎంపీపీ లు జడ్పీటీసీ లు మండల పార్టీ అధ్యక్షులు వైస్ ఎంపీపీ లు సర్పంచ్ ఎంపీటీసీ లు మరియు వివిధ హోదాలోని వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top