కోదాడలో ఘనంగా ప్రింటర్స్ డే వేడుకలు.జాన్ గూటెన్ బర్గ్‌కు ఘన నివాళి..
సాక్షిత :
ప్రపంచానికి అక్షర జ్ఞానాన్ని పంచేందుకు ప్రింటింగ్ ప్రెస్ యంత్రాన్ని కనిపెట్టిన జాన్ గూటెన్ బర్గ్ సేవలు చిరస్మరణీయమని కోదాడ ప్రింటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి కొనియాడారు. మంగళవారం ప్రింటర్స్ డే సందర్భంగా పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గూటెన్ బర్గ్ చిత్రపటానికి అసోసియేషన్ సభ్యులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక సమాజ అభివృద్ధిలో ముద్రణ రంగం కీలక పాత్ర పోషిస్తోందని, కార్మికులు మరియు యజమానులు సమన్వయంతో ముందుకు సాగాలని కోరారు.ప్రింటింగ్ ప్రెస్ రంగంపై ఆధారపడి వేలాది కుటుంబాలు జీవిస్తున్నాయని, ప్రతి ఒక్కరూ వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. అనంతరం సభ్యులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి నాగరాజు, కోశాధికారి చంద్రారెడ్డి, సంఘ సభ్యులు సాయి సిరి రమేష్, వెంకటేశ్వరరావు సుంకు శ్రీను, దాసరి శ్రీను, జీవన్, శరత్, సురేష్, సైదులు, కన్నయ్య, చారి,రమేష్, శన్ను తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
