48వ. డివిజన్ చంద్రబాబు కాలనీలో 47, 48,49,50వ. డివిజన్ల కార్పొరేటర్లకి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా ఆత్మీయ సన్మానం…
సాక్షిత పెద్దపల్లి //గోదావరిఖని . రామగుండం నియోజకవర్గంలోని స్థానిక 48వ.డివిజన్ చంద్రబాబు కాలనీలో ప్రాథమిక పాఠశాలలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మహంకాళి స్వామి డిప్యూటీ మేయర్ పాత పెళ్లి ఎల్లయ్య ఘనంగా ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి హాజరై 48వ. డివిజన్ కార్పొరేటర్ రేణిగుంట్ల నిర్మల దేవి తిరుపతి దంపతులు, 49వ. డివిజన్ కార్పొరేటర్ సాగి సంతోష్ రావు 47వ. డివిజన్ కార్పొరేటర్ దాసరి సాంబమూర్తి, కార్పొరేటర్ ముస్తఫా, కార్పొరేటర్ ధూళికట్ట సతీష్ యొక్క ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి చంద్రబాబు కాలనీ ప్రాథమిక కొన్నత పాఠశాల యాజమాన్యం స్టూడెంట్స్ అందరి ఆధ్వర్యంలో ఘనంగా ఆత్మీయ సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కార్పొరేషన్ మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ…ఈ పాఠశాలలో ఎటువంటి సమస్యలు ఉన్న మా దృష్టికి తీసుకురావాలని, మేము కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివినామని ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా మంచి విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచనలు ఇస్తూ, మీకు ఎలాంటి సమస్యలు ఉన్న తక్షణమే పరిష్కార మార్గం చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుమ్మడి రవి, ఉమాదేవి, ఉపేందర్, చలికాని సతీష్, రాధారపు అంజలి, భీమయ్య తదితరు పాల్గొన్నారు.

