కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సింగరేణి వ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం.

Sakshitha news

కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సింగరేణి వ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం.

ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్.

సాక్షిత పెద్దపల్లి : సింగరేణి లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమ‌స్యల పరిష్కారం కోసం ఏఐటియుసి కృషి చేస్తుందని, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్ పేర్కొన్నారు.

బుధవారం సింగరేణి ఆర్జీ వన్ ఏరియా లోని బి గెస్ట్ హౌస్ ఆవరణలో జరిగిన కాంట్రాక్టు కార్మికుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. సింగరేణి లో పని చేస్తున్న పర్మినెంట్ కార్మికుల సమస్యల పరిష్కారం తో పాటు కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గుర్తింపు సంఘం ఏఐటియుసి యాజమాన్యం తో మాట్లాడడం జరుగుతుందని, ముఖ్యంగా వారికి హై పవర్ కమిటీ వేతనాలు అమలు చేయాలని, పి.ఎఫ్, ఈ.ఎస్.ఐ అమలు చేయాలని, ప్రమాద బీమా అమలు చేయాలని తదితర డిమాండ్ లపై యాజమాన్యం తో చర్చించడం జరిగిందని, యాజమాన్యం కాంట్రాక్టు కార్మికుల సమస్యల ను పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటియుసి నిరంతరం పోరాటాలు ఉద్యమాలు చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. యాజమాన్యం కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటె సింగరేణి వ్యాప్తంగా ఏఐటియుసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన పేర్కొన్నారు.

ఈ సమావేశంలో బి గెస్ట్ హౌస్ నూతన కమిటీ ని నియామకం చేయడం జరిగింది, ఇంచార్జీ గా కనుకుంట్ల లక్ష్మణ్ ను నియమించడం జరిగింది. సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ అర్జీ వన్ అద్యక్షులు ఎం ఎ గౌస్ అద్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కాంట్రాక్టు కార్మికుల నాయకులు భూమయ్య తో పాటు సూరిబాబు, అభిబ్, సురేష్ రవీందర్, రాజేష్, జయమ్మ, మల్లీశ్వరి తిరుపతమ్మ, లత తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top