చిలుకూరు శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం…
సాక్షిత : స్థానిక శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో మాఘమాసం చివరి శుభ , అమావాస్య తిథి సందర్భంగా కాల్వొడ్డు, శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం లో ఉదయం స్వామి వారి కి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి కి ప్రత్యేక అభిషేకాలు ఆకు పూజలు చేయడం జరిగింది. మధ్యాహ్నం భక్తులు కు అన్నదానం చేయించిన దాతలు ఖమ్మం వాస్తవ్యులు శ్రీ మామిడి పుల్లారెడ్డి,మాధవి దంపతులు, ( ఎంకేఆర్ రైస్ మిల్ )చిలుకూరు శ్రీ చల్లా రంగయ్య వెంకటమ్మ దంపతులు, వారి కుమారుడు చల్లా అనిల్,.మరియు ధరావత్ నాగేశ్వరరావు జానుభాయి, దంపతులు, వారి కుమారుడు ధరావత్ శరత్ బాబు, స్వామి వారి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు, అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేసినారు. ఇట్టి కార్యక్రమం లో ఆలయం ఛైర్మన్ శ్రీ కొడారు వెంకటేశ్వర్లు, చలమయ్య శ్రీను, వీరభద్రం, చంద్రయ్య, రోజా భవానీ, లక్ష్మీ, లావణ్య,. మంగమ్మ, పద్మ, తదితరులు పాల్గొన్నారు.అన్నదానం చేయించిన దాతలు కు ఆలయం సంప్రదాయం ప్రకారం ఆలయం అర్చకులు శ్రీమాన్ చించాపట్నం రజనీ కాంత్ ఆచార్య వారు అన్నదాతలకు స్వామి వారి మెమెంటో తో సన్మానం చేసి స్వామి వారి దివ్య ఆశీస్సులతో అందజేశారు.

