జీడిమెట్ల,గాంధీనగర్ పారిశ్రామిక వాడల్లో సమ్మె విజయవంతం.

Sakshitha news

జీడిమెట్ల,గాంధీనగర్ పారిశ్రామిక వాడల్లో సమ్మె విజయవంతం.
కార్మిక సంఘం నాయకుల, కార్మికుల ప్రదర్శన.

బీజేపీ తెచ్చిన నూతన లేబర్ కోడ్ లను రద్దు చెయ్యాలని దేశవ్యాప్తంగా జాతీయ కార్మికులు సంఘాల పిలుపు మేరకు నేడు జీడిమెట్ల,గాంధీ నగర్ పరిశ్రమిక వాడల్లో పరిశ్రమల యాజమాన్యాలు స్వచ్చందంగా బంద్ ఇవ్వడం వల్ల కార్మికులు సమ్మె లో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చెయ్యడం జరిగింది.

షాపూర్ నగర్ లో జరిగిన కార్యక్రమానికి ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు స్వామి నాయకత్వం వహించగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ సిఐటియు నాయకులు అంజయ్య టి యుసిఐ నాయకులు ప్రవీణ్ ఏ ఐ ఎఫ్ టి యు నాయకులు పద్మక్కలు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తూ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని అందులో భాగంగానే నూతన లేబర్ కోడ్లను తీసుకొని వచ్చి 100 సంవత్సరాల క్రితం సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పని దినం ఉద్యోగ భద్రత యూనియన్ల ఏర్పాటు జీతభత్యాల కొరకు సంప్రదింపులు లాంటి అనేక చట్టాలను నిర్వీర్యం చేసి కంపెనీ యాజమాన్యాలకు అధికారమిచ్చి కార్మికులకు తీవ్రమైన అన్యాయానికి గురై చేస్తున్నారని, కార్పొరేట్ పెట్టుబడిదారులకు లక్షల వారికి ఊడిగం చేస్తున్నారని విమర్శించారు.

ఈ సమ్మెలో దేశవ్యాప్తంగా 30 కోట్ల మంది అసంఘటిత కార్మికులు పాల్గొంటున్నారని ఇది మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక లాంటిదని వెంటనే నూతన లేబర్ కోట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు జీడిమెట్ల లోని అనేక పారిశ్రామిక ప్రాంతాలకు తిరిగి కార్మికులను బందులో పాల్గొనేలా చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు నరసింహారెడ్డి, బక్కరి మల్లేష్, గుర్రప్ప, కే శ్రీనివాస్, పి శ్రీనివాస్, రమేష్,భీమేష్, మహేందర్,యాగంటి, మజ్జి గౌరీ, సిఐటియు నాయకురాలు స్వాతి, ఆంజనేయులు టి సి ఐ నాయకులు రాంబాబు తో పాటు వందలాదిమంది కార్మికులు పాల్గొన్నారు

Scroll to Top