సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ……..
జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. ఆర్ సునీత
సాక్షిత వనపర్తి : సైబర్ నేరాల పట్ల, బ్యాంకింగ్ వ్యవస్థ పనితీరు పట్ల అందరూ కూడా అవగాహన కలిగి ఉండాలి అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏం. ఆర్ సునీత అన్నారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ మరియు యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన న్యాయస్థానంలోని ఉద్యోగస్తులకు సైబర్ క్రైమ్స్, డిజిటల్ సేఫ్టీ మరియు బ్యాంకింగ్ స్కీమలపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత మాట్లాడుతూ సైబర్ మోసగాళ్లు వీడియో కాల్స్ ద్వారా డిజిటల్ గా అరెస్టు చేశామని భయభ్రాంతులకు గురిచేసి డబ్బులు కాజేస్తారు అని డిజిటల్ అరెస్టులు ఉండవు అని తెలియజేశారు. సులభంగా డబ్బు పొందాలని భావించి సైబర్ నేరస్తుల చేతిలో మోసపోవద్దని తెలియజేశారు. అదేవిధంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి మాట్లాడుతూ గుర్తుతెలియని ఫోన్ కాల్స్ కు వన్ టైం పాస్వర్డ్ చెప్పవద్దని తెలియజేశారు.
సైబర్ మోసానికి గురి అయిన వ్యక్తులు గంటలోపు 1930 కు కాల్ చేసి గోల్డెన్ అవర్ ను వినియోగించుకోవాలని సూచించారు. బార్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు ఎత్తుకు పై ఎత్తు వేస్తూ, మోసాలకి పాల్పడుతున్నారని, బ్యాంకు వారు ప్రజలకి అవగాహన కల్పించి, వారిని సైబర్ నేరాల పట్ల అప్రమత్తం చేయాలని కోరారు. మరియు యూనియన్ బ్యాంక్ డిప్యూటీ రీజినల్ మేనేజర్ మురళీకృష్ణ మాట్లాడుతూ పలు అంశాలు డిజిటల్ సేఫ్టీ, సైబర్ క్రైమ్స్ మరియు బ్యాంకింగ్ స్కీమ్స్ గురించి వివరించారు. అలాగే లీడ్ బ్యాంకు మేనేజర్ శివకుమార్, బ్యాంక్ మేనేజర్ లోకేష్ మరియు యూనియన్ బ్యాంక్ సిబ్బంది, బ్యాంకులోని పలు పొదుపు పథకాల గురించి, లోన్స్ గురించి మరియు సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జ్ కళార్చన, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ కవిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కార్తీక్ రెడ్డి, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీలత, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ అశ్విని , బార్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్, యూనియన్ బ్యాంక్ పానెల్ అడ్వకేట్ మోహన్ కుమార్, రిటైల్ హెడ్ నరేందర్ వర్మ, అసిస్టెంట్ ఎల్.డి.ఎం సాయి మరియు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

