3వ, 7వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ అఫ్సర్, భూక్య శ్రీలత

Sakshitha news

3వ, 7వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ అఫ్సర్, భూక్య శ్రీలత ని మెజారిటీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే నాగరాజు …

వర్ధన్నపేట మున్సిపాలిటీ 3వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ అఫ్సర్ భాయ్ 7వ వార్డు అభ్యర్థి భుక్య శ్రీలత – రాము ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు విస్తృతంగా ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే నాగరాజు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సామాన్యుల పక్షాన నిలబడి పనిచేస్తోందని, ప్రజల ఆశయాలకు అనుగుణంగా పాలన అందించడమే పార్టీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు…

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేదలు, రైతులు, కార్మికులు, మహిళలు, యువత సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని అన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, వాటికి తక్షణ పరిష్కారం చూపే నిజమైన ప్రజాస్వామ్య పార్టీ కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టం చేశారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గుర్తిస్తున్నారని, అందుకే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 3వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అఫ్సర్ భాయ్ గార్లను భారీ మెజారిటీతో గెలిపించి, వార్డుల అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు. ప్రజల సహకారంతో వర్ధన్నపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు..

ఇటీవలే మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సుమారు రూ.294 కోట్ల నిధులతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, మినీ స్టేడియం, సబ్ జైలు, మున్సిఫ్ కోర్టు నిర్మాణాలకు శంకుస్థాపన చేశారని తెలిపారు. ఈ పనులలో అవుట్‌సోర్సింగ్  ఉంటే వచ్చే ఉద్యోగాల్లో స్థానికులకే తొలి ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు….

ఎస్సీ కాలనీ లో గతంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి గత పదేళ్ల పాలించిన బిఆర్ఎస్ ఒక డబుల్ బెడ్ కూడా ఇవ్వలేదు  కానీ మన ప్రభుత్వం ఏర్పడ్డాక మున్సిపాలిటీలో సుమారు 150 ఇండ్లు మంజూరు చేయించాము ఇక్కడ మన ఎస్సీ కాలనీకి 15 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాము ఇంకా 50 నుంచి 100 ఇండ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అన్నారు…

పది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమిటో, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత జరుగుతున్న అభివృద్ధి ఏమిటో ప్రజలు గమనించాలని 3వ వార్డు అభ్యర్థి మహమ్మద్ అఫ్సర్ చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఎస్సీ కాలనీ వాసులను కోరారు…

ఈ సందర్భంగా  ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు కొండేటి అమల – అభిలాష్  గత అసెంబ్లీ ఎన్నికల్లో నాగరాజు  అన్న నాకు మాట ఇచ్చి ఇల్లు కట్టించాడు దయచేసి నాలాగనే మీ అందరికీ కూడా ఇల్లు వస్తాయి కేవలం అభిమాన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మనకు ఎమ్మెల్యే ఇచ్చిన మాట ప్రకారం 50 నుంచి 100 ఇండ్లు వస్తాయి నిరుపేదలమందరం ఇల్లు కట్టుకోవచ్చని తెలియజేశారు…

ఈ కార్యక్రమంలో  స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, మరియు ఇంచార్జీలు తదితరులు పాల్గొన్నారు….

Scroll to Top