మాధవ గూడెంలో ఘనంగా సమ్మక్క సారక్క జాతర….అమ్మ వార్లను దర్శనం చేసుకున్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్.. *.
సాక్షిత : చిలుకూరు మండలంలోని మాధవగూడెం గ్రామంలో గత మూడు రోజులుగా జరుగుతున్న సమక్క – సారక్కలమ్మ జాతర ముగిసింది. అమ్మవార్లు గద్దెలెక్కడంతో జాతరను రెండు రోజులుగా ముమ్మరంగా జరుతుంది, జాతర సందర్భంగా భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు I తీర్చుకున్నారు. గద్దెల వద్ద మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతరలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జాతరలో ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు బందోభస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ధృవకుమార్, ఎంపీవో ముక్కపాటి నరసింహారావు, దేవాలయం ధర్మకర్తలు బుడిగెం వీరభద్రయ్య, దాసరాజు తిరపయ్య, సర్పంచ్ దాసరాజు వీరబాబు, సోమగాని వెంకన్న, ఆదిరెడ్డి, ఆలయ దేవుడమ్మ బుడిగెం రాంబాయి, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

