విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు ఆలోచనలతో ప్రభుత్వ పాఠశాలల్లో నూతన విద్యా వ్యవస్థకు శ్రీకారం చుట్టబడింది – మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్రప్రసాద్ .
కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన విద్యావ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 10 వ తరగతి విద్యార్థి, విద్యార్థునులకు స్ఫూర్తి గైడ్స్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉయ్యూరు జెడ్పిహెచ్ స్కూల్లో విద్యార్థులకు గైడ్స్ పంపిణీ చేసిన రాజేంద్రప్రసాద్ గారు.
ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ…
ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు విద్య వ్యవస్థ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ నూతన టెక్నాలజీని విద్యకు జోడిస్తూ నేటి బాలలనే – రేపటి పౌరులుగా తీర్చిదిద్దాలని లక్ష్యంతో పనిచేస్తున్నారని, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో విద్యావ్యవస్థను ప్రత్యేకంగా తీర్చి దిద్దుతున్నామని , అలాగే బాలలందరూ చదువుకొని ఉన్నత స్థితికి రావాలని కోరుకుంటున్నట్లు రాజేంద్రప్రసాద్ అన్నారు.
ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు పడవల మధుసూదన్ రావు, ఉయ్యూరు జెడ్పిహెచ్ స్కూల్ చైర్మన్ ఆరేపల్లి శివ సాయి, స్కూల్ బోర్డు మెంబర్స్, హెడ్మాస్టర్, టీచర్స్ పాల్గొన్నారు

