PAC చైర్మన్ గాంధీ చేతుల మీదుగా చిన్నారులకు పతంగుల పంపిణీ
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పాపి రెడ్డి నగర్ బస్తీ అధ్యక్షుడు ఊట్ల చంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పతంగులను(గాలి పటాలను) PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ చేతుల మీదుగా పిల్లలకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలందరికి సంక్రాంతి పర్వదినం శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని, పిల్లలు పతంగులు ఎగురవేసే సమయంలో కనీస జాగ్రత్తలు పాటించాలని , స్వీయ రక్షణ చర్యలు తీసుకోవాలని, బిల్డింగ్ డాబా ల పై పిట్ట గోడల వద్ద జాగ్రతలు తీసుకోవాలని,ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎగురవేయలని, చైనా మాంజ ను వాడకూడదు అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో నాయకులు నరసింహులు ముదిరాజ్ .పేర్ని ధర్మారావు . ఏ ప్రభాకర్ రాపోల్ తిరుపతిరెడ్డి .పి శంకర్ రెడ్డి తాటికిరణ్. వనం ఆంజనేయులు ఎం కనకా రెడ్డి .గోపాల్ శ్యామల నర్సిరెడ్డి.. దాకూరు తిరుపతిరెడ్డి. హెచ్ రాజు రెడ్డి. మల్లేష్ మేస్త్రి.గజేంద్ర రెడ్డి .శ్రీకాంత్ రెడ్డి.సత్యనారాయణ. ఐలయ్య. వెంకటేష్. మల్లికార్జున్.లక్ష్మారెడ్డి. ప్లంబర్ యాదగిరి. చింటూ. పెద్ద ఎత్తున అభిమానులుతదితరులు పాల్గొన్నారు

