తెలంగాణ క్యాడర్లో జాయిన్ అయిన యువ IFS అధికారులు అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖను డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి గారు వారిని హృదయపూర్వకంగా అభినందించారు.
ప్రకృతి పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర అత్యంత కీలకమని మంత్రి పేర్కొన్నారు. అటవీ చట్టాలపై సంపూర్ణ అవగాహన కలిగి, అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు సేవలందించే విధంగా అంకితభావంతో పనిచేయాలని యువ అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా యువ IFS అధికారుల నేపథ్యం, వారు పొందిన శిక్షణ వివరాలను మంత్రి గారు సమగ్రంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం వీరికి ప్రత్యేకంగా తయారు చేయించిన పెన్నులను బహుమతిగా అందజేశారు. వీరి వెంట అటవీ దళాల ప్రధాన సంరక్షిణాధికారిణి డాక్టర్ సి సువర్ణ, రత్నాకర్ జవహరీ ఉన్నారు

