సర్పంచ్ తో పని చేయించుకోవడం ప్రజల హక్కు:గ్రామాభివృద్ధిలో ప్రజలదే కీలక పాత్ర
ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య
సాక్షిత: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట మండలం
కావడిగుండ్ల గ్రామంలో మాస్ లైన్ విజయోత్సవ సభ సర్పంచ్ తో పని చేయించుకోవడం ప్రజల హక్కని, ప్రజలు కూడా బాధ్యతాయుతంగా సర్పంచికి చేయూతనిస్తూ గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం కావడిగుండ్ల గ్రామంలో జరిగిన సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ విజయోత్సవ సభలో వారు పాల్గొని ప్రసంగించారు. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మండల కార్యదర్శి వాసం బుచ్చిరాజు అధ్యక్షతన జరిగిన విజయోత్సవలో గుమ్మడి నరసయ్య మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం దేశం బాగుంటుందని, అటువంటి గ్రామాల అభివృద్ధి స్థానికంగా ఎన్నుకున్న సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్ల పనితీరుపై ఆధారపడి ఉంటుందని నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యల పరిష్కారంలో పంచాయతీ, పాలకవర్గాలు ముందుండి పనిచేయాలని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాలసీ విషయాలకు సంబంధించిన పనులు విషయం ఎలా ఉన్నా ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న తక్షణ సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా సర్పంచులు పనిచేయాలని ఐదు సంవత్సరాల కాలం పాటు ప్రజల మనసు గెలిచే విధంగా సర్పంచులు వార్డ్ మెంబర్లు పనిచేసి ప్రజల మెప్పు పొందాలని వారు సూచించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో దేశంలో ఉన్న పాలకవర్గాలు అనేక ఉచిత హామీల పేరు తోటి ప్రజలను బురిడీ కొట్టించి గెలిచిన తరవాత హామీలు అమలు చేయడం లేదని ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీల పేరు తోటి ప్రజల్ని వంచిస్తున్నారని కెసిఆర్ ప్రభుత్వం పదివేలు రైతుబంధు పేరుతో ఇస్తే మా ప్రభుత్వం వస్తే పదిహేను వేలు రైతు భరోసా ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి శాటిలైట్ ప్రకారం రైతు భరోసా ఇస్తామని మాట మార్చి తప్పించుకుంటున్నారని మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి బస్సుల సంఖ్యను పెంచకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, రెండు లక్షలు రుణమాఫీ చేస్తానని అనేక కొర్రీలు పెట్టి పూర్తిస్థాయిలో అమలు చేయలేదని, ఏడవ గ్యారంటీ అని ప్రజాస్వామ్యయుతంగా పరిపాలిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్య విలువలను పాతర వేస్తున్నారని వారు తీవ్రస్థాయిలో విమర్శించారు. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ప్రజల కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాల ద్వారా ఉద్యమిస్తుందని,
పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరుస్తుందని ప్రజా ఉద్యమాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని ఆ దారిలో ప్రజలంతా పయనించాలని, నూతనంగా ఎన్నుకున్న గ్రామ పాలకవర్గాల ఆధ్వర్యంలో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కేంద్ర కమిటీ నాయకులు కెచ్చల రంగారెడ్డి మాట్లాడుతూ బ్రిటిష్ పరిపాలన కంటే ముందే భారత దేశంలో గ్రామపంచాయతీలు ఉన్నాయని, ప్లాసీ యుద్ధం తర్వాత రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న మనం స్వాతంత్రం అనంతరం ప్రభుత్వాలు కొన్ని చేర్పులు మార్పులతో గ్రామపంచాయతీ పాలనకు, గ్రామాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారన్నారు. రాజ్యాంగం ప్రకారం ఎన్నికలలో ఓట్లు కొనుగోలు చేయడం నేరమని, అయినప్పటికీ పాలక పార్టీలు విపరీతంగా ఎన్నికలలో డబ్బులు ఎరచూపి అధికారాన్ని చేజిక్కించుకుంటున్నారని, అధికారంలోకొచ్చి ప్రజా సమస్యలను విస్మరిస్తున్నారని, వాటికి భిన్నంగా కావడిగుండ్ల గ్రామపంచాయతీలో అధికార పార్టీ నాయకులు డబ్బులు మద్యం ఎరచూపినా వాటిని లెక్కచేయకుండా ప్రజల కోసం పనిచేసే సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం గొప్ప విషయమని, ఎన్నుకోబడిన అభ్యర్థులు ప్రజల కోసం పనిచేసి గ్రామ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి గోకినపల్లి ప్రభాకర్, కావడి గుండ్ల గ్రామపంచాయతీ సర్పంచ్ బాడిశ లక్ష్మణరావు, జిల్లా నాయకులు కంగాల కల్లయ్య, మాజీ సర్పంచ్ కంగాల భూలక్ష్మి, మండల నాయకులు కుంజా అర్జున్, గొంది లక్ష్మణరావు తదితరులు సభనుద్దేశించి ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మడకం మంగారావు, వార్డ్ మెంబర్లు పోతన సుధాకర్, కంగాల వంశీ కుమార్, కుంజ మంగ, కుంజ నాగమణి, కొమరం ముత్తమ్మ, వాసం పోతురాజు, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ గ్రామ నాయకులు మేన్ని పాండురాజు, ఈదర మోహన్ రావు, ఆకుల బాబురావు, పోతన కోటేశ్వరరావు, కుక్కల అప్పారావు, కుక్కల సోమేశ్వరరావు, కేరం శ్రీను, బన్నీ పార్వతి, తెల్లం సత్యం, మడివి నాగేశ్వరరావు, కబ్బడి కవిత, కంగాల సైదమ్మ, కంగాల కన్నయ్య, ఆకుల కృష్ణ, కొత్త కావడిగుండ్ల గ్రామ నాయకులు కంగాల వెంకటేష్, సోడెం పౌల్రాజ్, కనితి చిన్న జోగారావు, కొమరం చిన్న లక్ష్మి, కనితి జగ్గారావు, శ్యామల, కొమరం లక్ష్మణరావు, మడకం రాజు, సోడెం ప్రభాకర్, వాసం దుర్గ, కంట్లం గ్రామ నాయకులు మడకం ముత్యాలరావు, మడకం కృష్ణ, మడకం పాపారావు, మడకం దుర్గారావు, మడివి గంగరాజు, మడకం నరసయ్య, మడకం కృష్ణవేణి, మడకం లక్ష్మి, అరుణోదయ కళాకారులు కంగాల శంకర్, కారం తులసి, కంగాల చిన్న వంగారావు, కోడె మంగరాజు, కారం కార్తీక్, ధర్ముల రవి, సరియం గౌస్, సోడెం గంగరాజు , రవ్వ సాంబయ్య, కుంజా ఊసారావు తదితరులు పాల్గొన్నారు.

