మానవత విలువ లేని విద్య గుడ్డి విద్య
………..రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి చిన్నారెడ్డి
సాక్షిత వనపర్తి :
వనపర్తి పట్టణ ప్రధాన కూడలిలో ఫ్రేమ్ టైలర్ షాప్ యజమాని మన్యం కూతురు కావేరి పుట్టినరోజు , దేశ మొదటి హోం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 75వ వర్ధంతి సందర్భంగా చేయూత అనాధ ఆశ్రమపిల్లలకు నూతన వస్త్రాలు అందించే కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి పాల్గొనడం జరిగింది.
ఫ్రేమ్ టైలర్ షాప్ దగ్గర సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి చిన్నారెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు.
చేయుట అనాధాశ్రమ పిల్లలతో కావేరి పుట్టినరోజు సందర్భంగా 30 మంది పిల్లలకు నూతన వస్త్రాలను అందజేసి, కేక్ కట్ చేయించి అందరికీ పంచుతూ కావేరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కావేరి స్వయంగా చిత్రీకరించిన చిన్నారెడ్డి చిత్రపటాన్ని మన్యం చిన్నారెడ్డి కి బహుమతిని అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిమార్చి 2నా వనపర్తి పర్యటన సందర్భంగా కావేరి గీసిన రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి రేవంత్ రెడ్డి కి కావేరి మన్యం చేతుల మీదుగా అందజేయించారు.
చిన్నారెడ్డి మాట్లాడుతూ
ప్రేమ్ టైలర్ యజమాని మన్యం తన సంపాదించిన సంపాదనలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం చాలా సంతోషకరమని అభినందించడం జరిగింది. మన్యం గారుమానవత దృక్పథంతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో దేశంలో కొన్ని ప్రాంతాలు స్వతంత్ర రాజ్యాలుగా ఉండేవి వాటిని ఉక్కు దృక్పథంతో భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. చివరికి జునాగడ్, తెలంగాణ, కాశ్మీర్ స్వతంత్ర రాజ్యాలుగా ఉన్న సమయంలో దేశ హోం మంత్రిగా పోలీస్ చర్యతో స్వతంత్ర రాజ్యాలను భారతదేశంలో కలపడం జరిగింది అని అన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొన్ని రోజుల్లో వల్లభాయ్ పటేల్ మరణించడం చాలా దురదృష్టకరమని , పటేల్ ఆశయాలను కాంగ్రెస్ పార్టీ సాధించే దిశగా అడుగులు వేస్తుందని అన్నారు.
విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగిన తర్వాత చుట్టుపక్కల వారికి తగిన సహాయం చేస్తూ ఉండాలని సూచించారు. మానవతా విలువలు లేని విద్య గుడ్డివిద్య అని అన్నారు. సేవా కార్యక్రమం నిర్వహించినందుకు మన్నెం దంపతులకు చిన్నారెడ్డి గారు శాలువతో సన్మానం చేశారు.
కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చీర్ల జనార్ధన్, వనపర్తి జిల్లా మైనార్టీసెల్ అధ్యక్షుడు సమ్మద్ మియా, పెద్దమందడి మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెంటన్న యాదవ్, వనపర్తి జిల్లా ఏఐపిసి ఉపాధ్యక్షులు నాగార్జున, వనపర్తి పట్టణ ప్రధాన కార్యదర్శి బాబా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మన్యం యాదవ్, జానంపేట నాగరాజు, కోళ్ల వెంకటేష్, సురేష్,ఎంట్లరవి కొండన్న,నందిమల్ల సందీప్, గంధం లక్ష్మయ్య, గోవర్ధన్, పెద్దకోటయ్య, పాండు రావు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ గట్టు రాజు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
