ప్రచారాన్ని స్పీడ్ పెంచిన కూటమి పార్టీ సర్పంచ్ అభ్యర్థి వేమూరి సురేష్
కత్తెర గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థన
సాక్షిత ప్రతినిధి చిలుకూరు:
కూటమి పార్టీలు బలపరిచిన గ్రామ పంచాయతీ సర్పంచిగా ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి వేమూరి సురేష్ అన్నారు. గ్రామములో పెద్ద ఎత్తున వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ చిలుకూరు మండలం కట్ట కొమ్ముగూడెం (రామాపురం) గ్రామపంచాయతీఎన్నికల్లో కూటమి సర్పంచ్ అభ్యర్థిగా వేమూరి సురేష్ అనే నేను పోటీ చేస్తున్నాను ఎన్నికల గుర్తు కత్తెర పై గ్రామ ప్రజలు అమూల్యమైన ఓటు వేసి అత్యధిక ఓట్లతో గెలిపించాలని గ్రామ ప్రజలను అభ్యర్థించారు
తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల ,నీటిపారుదల శాఖ మంత్రి నలమాధ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానిక శాసన సభ్యురాలు నలమాధ పద్మావతి రెడ్డి పూర్తి సహాయ సహకారాలతో పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు తన గుర్తు కత్తెర గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో జనపనేని కృష్ణారావు, అయినాల ఉపేందర్, ఎస్కే పాషామియా, తిప్పిరి శెట్టి బసవయ్య, అలసగాని బ్రహ్మం వెమూరి రామారావు, వేముల వెంకయ్య పుల్లూరి అచ్చయ్య కట్టుకోల వెంకన్న వేమూరి నాగేశ్వరరావు, పుల్లూరి శ్రీనివాస్ రావు, మట్టయ్య తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
