స్థానిక ఎన్నికల నేపథ్యంలో అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం : సిఐ నాగరాజు రెడ్డి
సాక్షిత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట మండలంలో స్థానిక ఎన్నికల నేపాధ్యంలో అశ్వారావుపేట అంతర్రాష్ట్ర సరిహద్దులో పోలీసులు నాకాబంది ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నగదు, మద్యం లేక అక్రమ వస్తువుల రవాణా జరగకుండా ఉండేందుకు సీఐ నాగరాజు రెడ్డి ఆధ్వర్యంలో ఈ చర్యలు చేపట్టారు. అనుమానాస్పదంగా ఉన్న వాహనాలు, వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించి, ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత చర్యలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో సిఐ నాగరాజు రెడ్డి తో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
