భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి నివాళులర్పించిన బిజెపి నాయకులు

Sakshitha news

భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి నివాళులర్పించిన బిజెపి నాయకులు

ఘనంగా అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు
సాక్షిత : చిలకలూరిపేట పట్టణంలో 52 ఎకరాల్లో టిడ్కో హౌస్ నందు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన
చిలకలూరిపేట బిజెపి నాయకులు
ఈ సందర్భంగా బిజెపి పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివనాగేశ్వరరావు మాట్లాడుతూ
భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజిక సంస్కర్త, అణగారిన వర్గాలకు ఆశాకిరణంగా, తెలివితేటలను ఆయుధంగా, న్యాయాన్ని కవచంగా ఎంచుకున్న యోధుదిగా నిలిచారనీ. వివక్షకు వ్యతిరేకంగా ఆయన అవిశ్రాంత పోరాటం చేశారనీ
ఆయనను రాజ్యాంగ పితామహుడు అని పిలుస్తారనీ ఆయన రాజ్యాంగంలో న్యాయం, స్వేచ్ఛ సోదరభావం యొక్క విలువలను పొందుపరిచారని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు, పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్, జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటి నాగేశ్వరరావు, జిల్లా ఓబీసీ అధ్యక్షుడు పల్లపు శివయ్య, బీజేవైఎం కార్యవర్గ సభ్యులు పులిగుజ్జు మహేష్ , బిజెపి సీనియర్ నాయకులు రాజ్యలక్ష్మి,పట్టణ ఉపాధ్యక్షులు నరవర్యా హనుమాన్ సింగ్ , పట్టణ కార్యదర్శి మాచర్ల శ్రీనివాసరావు, మాజీ పట్టణ అధ్యక్షుడు దడబడ పుల్లయ్య,పట్టణ మీడియా ఇన్ఛార్జ్ రావికింది రామకృష్ణ, పట్టణ మైనార్టీ అధ్యక్షులు షేక్ సుభాని, పట్టణ కార్యదర్శి జోలపురం వెంకటరాయుడు,తదితరులు పాల్గొన్నారు తదుపరి అంబేద్కర్ చిత్ర పటాన్ని 52ఎకరాలు లొ ఉన్న పోలీస్ అవుట్ పోస్ట్ పోలీస్ వారికీ బహుకరించడం జరిగింది

Scroll to Top