అప్పలాయగుంటలో 23న కళ్యాణోత్సవం
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: తిరుపతికి 20కి.మీ దూరంలోని అప్పలాయగుంటలో టీటీడీకి చెందిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈనెల 23వ తేదీ కళ్యాణోత్సవం వైభవంగా జరగనుంది. అలాగే ఈనెలలో పలు విశేష ఉత్సవాలు జరగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. 5, 12, 19, 26వ తేదీలలో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు వస్త్రాలంకరణ సేవ, అభిషేకం…10న ఉదయం 8 గంటలకు అష్టోత్తర శత కలశాభిషేకం..
23న శ్రవణ నక్షత్రం సందర్బంగా ఉదయం 10.30. గంటలకు కల్యాణోత్సవం జరగనుంది. అలాగే 7, 14, 21, 28వ తేదీలలో శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి వారికి ఉదయం 8.15 గంటలకు అభిషేకం నిర్వహిస్తారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
